NTV Telugu Site icon

Mechanic Rocky Trailer 2.0: క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన పర్వాలేదు: విశ్వక్ సేన్

Mechanic Rocky Trailer 2.0

Mechanic Rocky Trailer 2.0

Mechanic Rocky Trailer 2.0: మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్ ఇప్పటికే ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాకు కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న విడుదల కానుండగా.. వరంగర్ లో ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. పట్టణంలో భారీగా హాజరైన సినీ అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 ను లాంచ్ చేశారు.

ఈ ప్రీరిలీజ్ కార్యక్రమంలో భాగంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ అభిమానులందరికీ థాంక్యూ సో మచ్ అంటూ మాట్లాడారు. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన ఎంపీ కావ్యకి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ.. మేము చాలా కష్టపడి సినిమా చేశామన్నారు. ఎంతో హార్డ్ వర్క్ చేసి మా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నామని, క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన.. ఏం కామెంట్ చేసినా పర్వాలేదన్నారు. కానీ, పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయకూడదని కోరుతున్నానట్లు విశ్వక్ అన్నారు. క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్ అని, పర్సనల్ ఒపీనియన్ చెప్పే సమయంలో ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ అప్ స్పీచ్ మాకు ఉందని ఆయన అన్నారు.

Also Read: Puspa 2 Trailer: ఊహించిన దానికంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న

ఇక మెకానిక్ రాకీ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడనని, మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చని అయ్యన అన్నారు. సినీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం మా పనని, మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు అంతే బాధ్యతగా ఉండాలని కోరుతున్నట్లు ఆయన మాట్లాడారు. నేను మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూశానని, సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. మళ్లీ సినిమా తీస్తానని అయ్యన అన్నారు. మాకు తెలిసిందంట ఒకటే సినిమా.. సినిమా.. సినిమా.. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీశామని విశ్వక్ సేన్ అన్నారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం అభిమానులు, ప్రేక్షకులేనని ఆయన అన్నారు. నాకు ఇంతటి మంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చిందని తెలిపాడు.

అలాగే సోమవారం (నవంబర్ 18) ఉదయం 11 గంటలకి మా ట్రైలర్ రిలీజ్ చేస్తామని, మా ట్రైలర్ చూడండని అయ్యన అన్నారు. డైరెక్టర్ రవితేజ తెలుగులో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని.. మీనాక్షి, శ్రద్ధ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పెమ్ చేశారని అన్నారు. నవంబర్ 21న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని, 21 న పెయిడ్ ప్రీమియర్ కి రండని ఆయన అన్నారు. నేను చేసిన పది సినిమాల ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నా.. ఇది చాలా మంచి సినిమా.. ఒక ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదని, సినిమా చూడండి అంటూ విశ్వక్ నమ్మకం వ్యక్తం చేసాడు. మీరు బాగుందని చెప్తే 22 నుంచి మిగతా ఆడియన్స్ చూస్తారని ఆయన అన్నారు. ఇక చివరిలో ఈవెంట్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. జైహింద్ అని అన్నారు.

Show comments