Kadapa Municipal Corporation: కడపలో మేయర్ సురేష్ బాబు వర్సెస్ కమిషనర్‌గా మారిపోయింది వ్యవహారం.. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉత్కంఠభహితంగా సాగింది.. ఉదయం నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అక్కడ నెలకొంది… మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కల్పించాలని సజావుగా నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.. హైకోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ వద్ద భారీ పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు. అయితే, ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కలిసి ఆమె కార్యాలయం వద్ద నుంచి కడప కార్పొరేషన్ వద్దు వరకు ర్యాలీగా వచ్చారు. కడప కార్పొరేషన్ వద్ద పోలీసులు టిడిపి కార్యకర్తలను అడ్డుకొని ఎమ్మెల్యేని కార్పొరేటర్లు మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతిచ్చారు… మున్సిపల్ సమావేశ మందిరంలో వేదికపై ఎమ్మెల్యేకి అధికారులు కుర్చీలు వేశారు. ఎమ్మెల్యే తన ఖర్చులు కూర్చొని సమావేశ నిర్వహణ కోసం ఎదురు చూశారు… అయితే మేయర్ సురేష్ బాబు తమ కార్పొరేటర్లతో ఆయన కార్యాలయంలో సమావేశం అయ్యారు.. కాన్ఫరెన్స్ హాల్ తాళాలు తెరవాలంటూ మేయర్ తో పాటు కార్పొరేటర్లు పట్టుబట్టారు.. అధికారులు తాళాలు తెరవకపోవడంతో కాన్ఫరెన్స్ హాలు బయట సమావేశం నిర్వహించారు…
Read Also: Arrowhead Dies: మొసళ్లను సైతం వేటాడే ప్రసిద్ధ పెద్ద పులి “ఆరోహెడ్” ఇక లేదు.. లాస్ట్ వీడియో..!
మున్సిపల్ సర్వసభ్య సమావేశం మీటింగ్ హాల్లో నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు.. అక్కడ కడప ఎమ్మెల్యే మాధవి తో పాటు టిడిపికి చెందిన 8 మంది కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. గత పది రోజులుగా మీటింగ్ హాల్ తాళాలు తెరవాలని మేరు సురేష్ బాబు కమిషన్ కోరుతూ వచ్చారు. అయితే తాళాలు తెరవకపోవడంతో మున్సిపల్ సమావేశాన్ని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలని ఆయన కమిషనర్ ను కోరారు. మున్సిపల్ అధికారులు మీటింగ్ హాల్లో ఏర్పాటు చేశామని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు వీలు కాదంటూ చేతులు ఎత్తేశారు.. దీంతో, ఆగ్రహించిన మేయర్ సురేష్ బాబు.. వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కాన్ఫరెన్స్ హాల్ బయట జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులు డుమ్మా కొట్టారు.. మేయర్ సురేష్ బాబు మీడియా సమక్షంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.. అజెండాలోని 28 అంశాలను కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు… ఎమ్మెల్యే మాధవి మాత్రం మీటింగ్ హాల్‌లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూసి ఆ తరువాత అక్కడి నుండి తన కార్పొరేటర్లతో కలిసి వెళ్లిపోయారు… మేయర్ నిర్వహించిన సమావేశానికి మున్సిపల్ అధికారులు ఎవరూ రాకపోవడంతో ఈ సమావేశానికి చట్టబద్ధత ఉంటుందా? లేదా? అనేది సంశయంగా మారింది… మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది.. అయితే ఈ నెల 22 కి ఆరు నెలల గడువు పూర్తి కావస్తు ఉండడంతో ఈరోజు జరిగిన సమావేశాన్ని అధికారులు ఆమోదిస్తే జనరల్ బాడీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు… అలా లేని పక్షంలో పాలక పక్షంపై అనర్హత వేటి పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… అయితే పాము నిర్వహించిన సమావేశానికి అధికారులు కావాలని రాలేదని పాలక పక్షం హైకోర్టును ఆశ్రయించే అవకాశం మెండుగా ఉంది…
