NTV Telugu Site icon

Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..

Mayawathi

Mayawathi

BSP Party: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్నోలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. సమాజ్ వాదీ పార్టీతో పాటు బీజేపీని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తమ పార్టీ మద్దతును నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.. అలాగే, మన ఓట్ల శాతం కూడా తగ్గుతుందన్నారు. అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా పార్టీలు భావిస్తున్నాయి.. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది చెప్పుకొచ్చారు. అత్యున్నత నాయకత్వం దళితుడి చేతిలో ఉన్నందున ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని మాయావతి వెల్లడించారు.

Read Also: Mantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం.. తప్పని ఇక్కట్లు

అయితే, అగ్రవర్ణాల ఓట్లు బీఎస్పీకి పడవు అని మాయావతి పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిందన్నారు. బీఎస్‌పీ ఎవరికీ ఉచితంగా మద్దతివ్వదు.. ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచించవచ్చని ఆమె అన్నారు. దేశంలో త్వరలో ప్రకటించబోయే లోక్‌సభ ఎన్నికల్లో దళితులు, గిరిజనులు, అత్యంత వెనుకబడిన ముస్లింలు, మైనారిటీలకు మద్దతుగా మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. నేటి ప్రభుత్వాలు పేర్లు మార్చడం, వాస్తవంతో సంబంధం లేని ప్రకటనలు చేయడంలో బీజీగా ఉన్నాయని మాయావతి అన్నారు.

Read Also: OTT Movies Telugu: సినీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం ఏకంగా 45 సినిమాలు రిలీజ్..

కానీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కులవాద ఆలోచనలను కలిగి ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. తన పేరు చెప్పకుండానే బీజేపీని ఉద్దేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం, సంస్కృతి మంటల్లో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.. యూపీలో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల కోసం పని చేశామని తెలిపింది. ఇందులో మైనారిటీలు, పేదలు, దళితులు, రైతులతో పాటు ఇతర శ్రామిక ప్రజల కోసం ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించామని పేర్కొనింది. రాబోయే తరం కోసం దళితులు, మైనార్టీలు, పేదలు, రైతులతో పాటు ఇతర వర్గాల ప్రజలు అంబేద్కర్ మార్గంలో నడుస్తున్న బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని మాయావతి పిలుపునిచ్చారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానంపై మాయావతి మాట్లాడుతూ.. నాకు ఆహ్వానం అందింది.. నేను పార్టీ పనిలో బిజీగా ఉన్నందున అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకోలేదు.. అయితే, ఏ కార్యక్రమం నిర్వహించినా మాకు అభ్యంతరం లేదు అని ఆమె చెప్పుకొచ్చారు.

Show comments