ప్రస్థానం, రిపబ్లిక్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ‘మయసభ’. సోనీ లివ్ ఒరిజినల్స్ గా వచ్చిన ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు, వారి నిజ స్వభావం వంటి అంశాలు, అలాగే ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు వంటి అంశాలను ముడిపెడుతూ తెరకెక్కించిన మయసభ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది.
ఈ సిరీస్ చుసిన వారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి తీశారనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆది పినిశెట్టి (చంద్రబాబు) గా చైతన్య రావు (వై యస్) పాత్రలలో నటించగా వారి రాజకీయ ప్రస్థానం, కాలేజీ రోజులు, ఇబ్బందులు, ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉండేదో కాస్త ఫిక్షనల్ జోడించి తెరకెక్కించాడు. అలాగే రాజకీయాలలో పైకి రావాడానికి కులం కార్డు ఎంత ఆవరసమో అనేది బోల్డ్ గా క్లియార్ గా చూపించిన విధానానికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అప్పటి దళిత కాంగ్రెస్ సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఎలా అవమానించారో అది 1982లో టీడీపీ తెలుగు ఆత్మగౌరవ ఉద్యమానికి ఎలా దారితీసింది వంటి అంశాలు చక్కగా మలిచాడు దేవకట్ట.
విమర్శలు : అయితే ఓ నాయకుడిని సంకర జాతి నాయకుడని, కులం నుండి వెలిశారు అని ప్రస్తావించడం, నా బిడ్డకు మీ పేరే పెట్టుకున్న, మేము చూసిన రాముడు, కృష్ణుడు మిరే అని మరో నాయకుడితో చెప్పించడం వంటి వాటిపై విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే చంద్రబాబు పాత్రకు హీరోయిన్ తో ప్రేమాయణం అనేది పూర్తిగా ఫిక్షనల్ అయినా కూడా అనవసరం అనే విమర్శలేకపోలేదు.
ఏదేమైనా మయసభ సిరీస్ తో దేవకట్ట మెప్పించాడు. రైజ్ ఆఫ్ టైటాన్స్ లో ఫిక్షనల్ స్టోరీని ఎక్కువ చొప్పించిన దర్శకుడు పార్ట్ 2 క్లాష్ ఆఫ్ టైటాన్స్ లో ఒరిజినలాటి ఎక్కువ ఫిక్షనల్ తక్కవ చేస్తాడేమో చూడాలి.
