NTV Telugu Site icon

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. టీమిండియా యువ బౌలర్ ఔట్!

Mayank Yadav

Mayank Yadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్.. ఫస్టాఫ్ సీజన్ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. టోర్నీ మొదటి అర్ధభాగంలో మయాంక్ అందుబాటులో లేకపోవడం లక్నోకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.11 కోట్లకు లక్నో అతడిని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. 2024 సీజన్‌కు ముందు రూ.20 లక్షలకు (అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్‌) కొనుగోలు చేసింది.

Also Read: Rohit Sharma: బాధ పెట్టాలని నేను ఎవరినీ తిట్టను: రోహిత్

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో మయాంక్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ.. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందులు పెట్టాడు. 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ సిరీస్‌లో వెన్ను గాయం తిరగబెట్టింది. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ‌ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ పొందుతున్నాడు. మయాంక్ గాయంపై ఇప్పటి వరకు అటు లక్నో ప్రాంచైజీ కానీ.. ఇరు బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఫిట్‌నెస్ సాధిస్తే.. సెకండాఫ్‌లో ఆడుతాడని ఎన్‌సీఏ వర్గాలు ఓ జాతీయ మీడియాకు తెలిపాయి. ఐపీఎల్ 2025 లో లక్నో టీమ్ రిషభ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.