NTV Telugu Site icon

Maya Bazaar For Sale: ‘మాయాబజార్ ఫర్ సేల్’ అంటున్న రానా.. ఎక్కడంటే ‘జీ5’లో

Maya Bazaar For Sale

Maya Bazaar For Sale

Maya Bazaar For Sale: ‘జీ5’ (Zee5)… దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద డిజిటల్ మాధ్యమం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేస్తోంది. అనేక వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిన్న చిత్రాలు నేరుగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతున్నాయి. ఇదే క్రమంలో ‘మాయాబజార్ ఫర్ సేల్’ (Maya Bazaar For Sale) అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించనుంది. జులై 14 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ (OTT Streaming) కానుంది. ఈ వెబ్ సిరీస్.. గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్యామిలీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందింది.

Read Also:Mexico: తుపాకీతో బెదిరించి 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖ సిబ్బంది కిడ్నాప్

‘మాయాబజార్ ఫర్ సేల్’ జీ5 వెబ్ ఒరిజినల్‌ను ZEE 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన ‘స్పిరిట్ మీడియా బ్యాన‌ర్’ క‌లిసి రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌కు రైట‌ర్‌, డైరెక్టర్ గా గా గౌత‌మి చ‌ల్లగుల్ల వ్యవహరిస్తున్నారు. రాజీవ్ రంజ‌న్ నిర్మిస్తున్నారు. కథ విషయానికొస్తే.. ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారందరూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. అదే టైమ్‌లో వారి గేటెడ్ క‌మ్యూనిటీని అన‌ధికారికంగా నిర్మించినట్లుగా ప్రభుత్వం నుంచి ఒక ప్రక‌ట‌న వస్తుంది. ఇళ్లను కూల్చేందుకు బుల్డోజ‌ర్స్ కూడా వ‌స్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిని ఆసక్తిగా తెరకెక్కించారు. ప్రత్యేకించి మోడరన్ సొసైటీలో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి? సామాజిక జీవన విధానం ఎలా ఉంటుందనే కోణంలో సైటరికల్ కామెడీగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో న‌వ‌దీప్, ఈషా రెబ్బా, హ‌రితేజ‌, న‌రేష్ విజ‌య్ కుమార్‌, ఝాన్సీ ల‌క్ష్మీ, కోట శ్రీనివాస‌రావు, మియాంగ్ చంగ్‌, సునైన‌ పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు.

జీవితంలో ఆనందం అంటే ఎలా ఉంటుంది.. దాన్ని స‌మాజం ఎలా అంచ‌నా వేస్తుంది? అనే అంశాల‌ను ఈ సిరీస్‌లో కామెడీగా చూపిస్తున్నట్లు నిర్మాత రాజీవ్ రంజ‌న్ వెల్లడించారు. ఈ సిరీస్ అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో రూపొందిన ఈ వెబ్ ఒరిజనల్ త‌ప్పకుండా ప్రేక్షకుల‌ను మెప్పిస్తుందని జీ5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా తెలిపారు. ఈ సిరీస్ చూసినవారంతా చిత్రంలోని పాత్రల్లో తమను తాము చూసుకుంటారని డైరెక్టర్ అన్నారు.