టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ గా, హీరోగా రానించి తర్వాత విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్.. తాజాగా మరో నెగటివ్ రోల్ ను అంగీకరించాడు. ఈసారి అతడు విలన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు.కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ లో సునీల్ విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సునీల్ కు.. ఇప్పుడు శాండల్‌వుడ్ నుంచి పిలుపు రావడం గమనార్హం. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది.
అయితే ఈ సినిమా లోని నటీనటుల గురించి మాత్రం అంతగా సమాచారం లేదు.అయితే ఈ మధ్యే సునీల్ ఈ మూవీ లో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను అనౌన్స్ చేశాడు. విజయ్ కార్తికేయ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సునీల్ ను మ్యాక్స్ సినిమా లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమా కు సునీల్ అదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా చేశారు.మరికొందరు మాత్రం స్థానికంగా ఉన్న టాలెంటెడ్ నటులను కాదని, పక్క ఇండస్ట్రీ లో నుంచి నటీనటులను తీసుకొని రావడమేంటని చిత్ర యూనిట్ ను ప్రశ్నించారు. మ్యాక్స్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు సంయుక్త హోర్నాడ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత సుదీప్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొననున్నారు..సునీల్ ప్రస్తుతం పాన్ ఇండియా యాక్టర్ గా దూసుకుపోతున్నారు. కేవలం విలన్ పాత్రలే కాకుండా తనకు బాగా అలవాటు వున్న కామెడీ పాత్రలు కూడా చేసి అదరగొడుతున్నారు..త్వరలోనే మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ లో సునీల్ నటించే అవకాశం వుంది..
