Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు ఫోక్ లోర్, మిథలాజికల్ అడ్వెంచర్ కథల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ఫాంటసీ లోకంలోకి తీసుకెళ్లేందుకు ముస్తాబవుతున్న మరో భారీ విజువల్ వండర్ “మత్స్య”. యంగ్ టాలెంటెడ్ యాక్టర్ వివస్వాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా టాప్ క్వాలిటీ వీఎఫ్ఎక్స్, గ్లింప్స్ చివర్లో నీటి అడుగున కనిపించే భారీ ‘మిథికల్ ఫిష్’ విజువల్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను అమాంతం పెంచేశాయి. ‘అమ్మా.. కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..!’ అని ఓ చిన్న పిల్లాడు అడగగా.. ‘ఒక ఫిష్ కథ చెప్పనా..’ అంటూ తల్లి చెప్పే వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. ఎన్నో వింతలు, అద్భుతాలు దాగున్న ఆ ఫాంటసీ కథలో హీరో క్యారెక్టర్‌ను ఓ ‘మిస్టీరియస్ ట్రావెలర్’గా అత్యంత కలర్ఫుల్గా ఆవిష్కరించారు. తొలి సినిమానే అయినా వివస్వాన్ తన స్టైలిష్ అప్పీయరెన్స్, బాడీ లాంగ్వేజ్‌తో టాలీవుడ్‌కు ఒక ప్రామిసింగ్ యంగ్ హీరో దొరికాడనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
ఈ గ్లింప్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన హైలైట్ పాయింట్.. చివర్లో హీరో ప్రయాణిస్తున్న పడవ కింద నుంచి ఓ భారీ Mythical Fish వేగంగా దూసుకువెళ్లడం. ఈ ఒక్క షాట్‌తో దర్శకులు తాము సృష్టించిన సరికొత్త సినిమాటిక్ వరల్డ్ ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్ ఇచ్చారు. పక్కా ఫోక్ లోర్, అడ్వెంచర్ అంశాలను మేళవించి తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ విజువల్స్ ద్వారా స్పష్టమవుతోంది. జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి గోలి, తేజ కనకాల సంయుక్తంగా కథను అందించి దర్శకత్వం వహిస్తున్నారు. టెక్నికల్‌గానూ ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రాబోతోంది. స్టార్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ గుప్తా సంగీతం ఈ మాయా ప్రపంచానికి ప్రాణం పోయనున్నాయి. జే కృష్ణ పదునైన డైలాగ్స్ అందిస్తుండగా, దేవపుత్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ కల్ట్ ఫోక్ లోర్ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను మేకర్స్ బయటపెట్టనున్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Tags
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!