Site icon NTV Telugu

Mathuvadalara2 : ఓవర్సీస్ లో డాలర్స్ వర్షం కురిపించిన MV2

Untitled Design (5)

Untitled Design (5)

శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అద్భుతమై కలెక్షన్స్ సాధించింది మత్తువదలరా 2. శ్రీ సింహ మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్  సంయుక్తంగా నిర్మించారు.

Also Read : Allu Arjun : పుష్ప రూలింగ్ ‘కౌంట్ డౌన్‌’ స్టార్ట్.. పోస్టర్ చూసారా..?

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం ముగిసే నాటికి 24.01 కోట్ల రూపాయలు రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు $300K పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ మరియు  మౌత్ టాక్ తో దూసుకెళ్తూ $1 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ వారాంతం మారే సినిమాలు లేకపోవడంతో రెండవ వారంలోను డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా బయ్యర్స్ కు లాభాల తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఈ మత్తు వదలరా 3, 4 కూడా తెరకెక్కిస్తామని ఆ మధ్య జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు నితీష్ రాణా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version