Allu Arjun : పుష్ప రూలింగ్ ‘కౌంట్ డౌన్’ స్టార్ట్.. పోస్టర్ చూసారా..?
- శరవేగంగా షూటింగ్ చేస్తున్న పుష్ప రాజ్
- డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్
- స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read : Jr NTR : ఇంక ‘దేవర’కు నో ఈవెంట్స్.. కారణం ఇదే..?
Also Read
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబరు 6 న రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ కు కౌండౌన్ మొదలెడుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కేవలం 75 రోజులు మాత్రమే పుష్ప రాజ్ రూలింగ్ చూడబోతున్నారు అని స్పెషల్ పోస్టర్ ను ఫ్యాన్స్ కోరిక మేరకు విడుదల చేసారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ఈ సినిమాలో వచ్చే జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. అక్టోబర్ చివరి నాటికి టోటల్ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసేందుకు లాంగ్ షెడ్యూల్ లో శరవేగంగా షూట్ చేస్తున్నాడు సుక్కు. పుష్ప-2లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సిక్వెల్ లో వచ్చే ఐటం సాంగ్ లో నటించే భామ ఎవరనేది త్వరలోనే క్లారిటీరానుంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!