NTV Telugu Site icon

Mathu Vadalara 2: ‘మత్తువదలరా-2’ ట్విట్టర్ రివ్యూ.. నవ్వి నవ్వి పొట్ట నొప్పొచ్చిందిరా బాబోయ్!

Mathu Vadalara 2 Teaser

Mathu Vadalara 2 Teaser

Mathu Vadalara 2 Movie Twitter Review: శ్రీసింహా కోడూరి హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తువదలరా 2’ . ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ నేడు (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇ‍ప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. ఎక్స్ (ట్విటర్‌) వేదికగా ఆడియన్స్‌ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

Also Read: Navdeep Singh-PM Modi: నవ్‌దీప్‌.. ఎందుకు అంత కోపం: ప్రధాని మోడీ

మత్తువదలరా -2 ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని ఆడియన్స్‌ పేర్కొంటున్నారు. నాన్‌స్టాప్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని, నవ్వి నవ్వి పొట్ట నొప్పొచ్చిందిరా బాబోయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య కామెడీ టైమింగ్, ఫర్మామెన్స్‌ అదిరిపోయిందంటున్నారు. బ్లాక్‌బస్టర్‌ లాఫ్ పక్కా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తునారు. మత్తువదలరా -2 ‘బ్లాక్‌బస్టర్‌ హిట్’ అని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. కొందరు 2.75 రేటింగ్ ఇస్తే.. మరికొందరు 3 రేటింగ్ ఇస్తున్నారు.

Show comments