Site icon NTV Telugu

Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌ పై ఐదేళ్ల వేటు!

Bangladesh

Bangladesh

Match-Fixing in Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) గత కొంతకాలంగా అనేక వివాదాలతో సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత, ఐసీసీ మెన్ టీ20 వరల్డ్ కప్ నుండి వైదొలగడం వంటి పరిణామాల తర్వాత ఇప్పుడు దేశ క్రికెట్ ఉనికినే దెబ్బతీసేలా మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన సీజేకేఎస్ (CJKS) టాలెంట్ కప్ 2026లో ఏడుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌ కు పాల్పడినట్లు తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఏప్రిల్ 3న జరిగిన టీ20 టోర్నమెంట్‌లో బాకలియా ఏకాదశ, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బాకలియా ఏకాదశ జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఉమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహ్మద్ ఇక్బాల్ మరియు నాజ్ముల్ ఇస్లాంలు కావాలనే వింతగా ఆడుతూ అవుట్ అయ్యారు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరపగా.. వారు ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తేలింది.

Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

ఈ ఫిక్సింగ్ ఉదంతంలో కేవలం ఆటగాళ్లే కాకుండా కోచ్ అమీనుల్ హక్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనిని తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఛట్టోగ్రామ్ జిల్లా క్రీడా సంస్థ (CJKS), కోచ్ అమీనుల్ హక్‌ను ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది. అలాగే సదరు ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని దేశీయ లీగ్‌ల్లో అమలు చేయాలని బీసీబీ (BCB)కి అధికారికంగా లేఖ రాసింది.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) కూడా గతంలో ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. బీసీబీ డైరెక్టర్ ముఖ్లేసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 2025 సీజన్‌లో ఆరుగురు జాతీయ ఆటగాళ్లతో సహా మొత్తం 10 మంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం నిఘాలో ఉండటం గమనార్హం. ఇలాంటి వరుస సంఘటనలు ప్రపంచ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.

Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

వరుస ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌ పై వన్డే సిరీస్ గెలవడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే 12 నెలల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో సిరీస్లు ఆడనుంది. మరోవైపు భారత్‌తో దెబ్బతిన్న సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు మహిళా బీపీఎల్ (WBPL) ద్వారా భారత మహిళా క్రికెటర్లను ఆహ్వానించాలని బంగ్లాదేశ్ బోర్డు యోచిస్తోంది.

Exit mobile version