లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొలంబో లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. యోని పటేల్, పి ఆకాష్ పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. మార్చి 8 నుంచి 19 వరకు క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో జరిగిన లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Also: Off The Record: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న పోలింగ్ తరువాత లెక్కలు..!
ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ ఫైనల్లో రాజస్తాన్ కింగ్స్, న్యూయార్క్ సూపర్ స్ట్రైయికర్స్ జట్లు తలపడ్డాయి. ఫైనల్లో న్యూయార్క్ సూపర్ స్ట్రైకర్స్‌పై రాజస్థాన్ కింగ్స్ విజయం సాధించింది. కాగా.. పటేల్ క్యాండీ స్వాంప్ ఆర్మీ జట్టుకు యజమాని. లీగ్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి తమను సంప్రదించినట్లు శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్, జాతీయ సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఉపుల్ తరంగ.. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ నీల్ బ్రూమ్ శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగానికి తెలిపారు.
Read Also: Tragedy: విషాదం.. నీటి తొట్టెలో పడి రెండేళ్ల బాలుడు మృతి