Ind vs Nz: న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. భారత్‌తో జరిగిన 220 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 104 పరుగులు చేయగా… ఇంతలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది, చివరికి దానిని రద్దు చేయాల్సి వచ్చింది. 57 పరుగులు చేసిన కివీస్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఉమ్రాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 97 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్‌ను నష్టపోయింది. అనంతరం క్రీజ్‌లోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. అయితే మరో ఓపెనర్ డేవన్ కాన్వే మాత్రం దూకుడు పెంచాడు. అయితే మ్యాచ్ 18 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. ఈ మ్యాచ్‌లో ఇంకో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే కివీస్ విజయం సాధించేది. 18 ఓవర్లు పూర్తి అయ్యేసరికి న్యూజిలాండ్ 104/1 స్కోరుతో ఉంది. డక్‌వర్త్ లూయిస్ అమలు చేయాలంటే వన్డేల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల ఆట జరగాలి.
Measles Outbreak: మహారాష్ట్రలో మీజిల్స్ విజృంభణ.. 700 దాటిన కేసుల సంఖ్య
భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను 219 పరుగులకే కట్టడి చేసింది. ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇంతకుముందు జరిగిన టీ20 సిరీస్ కూడా ఇలానే వర్షం కారణంగా అంతరాయాలతోనే భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకొంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా టామ్ లాథమ్‌కు అవార్డు దక్కింది.
