Site icon NTV Telugu

T20 World Cup: అడ్డంకిగా మారిన వరుణుడు.. ఐర్లాండ్‌తో అఫ్గాన్‌ మ్యాచ్ రద్దు

Afg Vs Ire

Afg Vs Ire

T20 World Cup: ఆస్ట్రేలియాలో టీ-20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. సూపర్‌-12 పోరులో భాగంగా అఫ్గాన్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ రద్దైంది. అఫ్గాన్‌ జట్టుకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇదే పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. సూపర్‌-12 పోటీల్లో అఫ్గాన్‌ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మెల్‌బోర్న్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు అయింది.

Amit Shah: ‘ఇక ఆపండి’.. హర్యానా హోంమంత్రిని సున్నితంగా మందలించిన అమిత్‌ షా

ప్రస్తుతం గ్రూప్‌-1లో అఫ్గానిస్థాన్‌ జట్టు మూడు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇందులో ఒక మ్యాచ్‌లో ఓటమి ఎదురురాగా.. మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ఐర్లాండ్‌ ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దుతో మూడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌కు శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి గట్టి జట్లతో మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఐర్లాండ్‌ కూడా ఆసీస్, న్యూజిలాండ్‌ టీమ్‌లతో తలుపడాల్సి ఉంది.

Exit mobile version