Site icon NTV Telugu

Mukesh Ambani: 5జీ కంటే మాతాజీ, పితాజీలే గొప్ప.. వారికంటే గొప్ప ‘జీ’ లేదు..

Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani: ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే అత్యంత ముఖ్యమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. గుజరాత్‌లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఇచ్చే మద్దతు గురించి తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇది మీ రోజని, మీరేంటో ప్రపంచానికి తెలిసే రోజని… అయినప్పటికీ మీరు నిల్చున్నది మీ తల్లిదండ్రుల రెక్కలపైనే అని చెప్పారు. ప్రస్తుత యువత 4జీ, 5జీ గురించి ఉత్సాహంగా ఉన్నారు కానీ.. మాతాజీ, పితాజీ కంటే 5జీ ఏమాత్రం గొప్పది కాదని చెప్పారు. వారి కంటే ప్రపంచంలో గొప్ప ‘జీ’ లేదని తల్లిదండ్రుల గొప్పదనాన్ని వివరించారు.

OYO: ఓయోలోనూ ఉద్యోగాల కోత.. 600 మంది తొలగింపు

మీ తల్లిదండ్రులకు కూడా ఈరోజు ప్రత్యేకమైనదని.. వారు వేదికపైకి మీరు వెళ్లి గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేట్ స్వీకరించడం కోసం ఎదురుచూస్తున్నారని.. ఇది వారి చిరకాల స్వప్నమని అన్నారు. మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడిన శ్రమను మర్చిపోవద్దని చెప్పారు. మీకు వాళ్లు ఎప్పుడూ అండగా ఉంటారని… మీ బలానికి మూలస్తంభాలు వారేనని అన్నారు. 2047 నాటికి భారతదేశం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువత సహాయపడుతుందని తాను నమ్మకంతో ఉన్నానని ఆయన చెప్పారు. వ్యాపార దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవల దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 5G సేవలను విజయవంతంగా ప్రారంభించింది.

Exit mobile version