Site icon NTV Telugu

Stock Market: ఎంత మోసం.. దలాల్ స్ట్రీట్‌ లొసుగులను వాడుకొని కోట్లు కొల్లగొట్టిన అమెరికా సంస్థ..!

Stock Market

Stock Market

Stock Market: 21 రోజులు.. నాలుగున్నర వేల కోట్లు.. ఇదీ అమెరికా ట్రేడింగ్ సంస్థ సంపాదించిన సొమ్ము. అవును నిజమే.. మీరు చదివిన సంఖ్యలు నిజమే.. అది కూడా మన స్టాక్ మార్కెట్‌లో. దలాల్ స్ట్రీట్‌లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. బిగ్‌ ఫ్రాడ్‌కు పాల్పడింది అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్‌ ట్రేడింగ్‌ సంస్థ. దీన్ని గుర్తించిన సెబీ వెంటనే చర్యలు తీసుకుంది.

జేన్‌ స్ట్రీట్‌కు చెందిన నాలుగు అనుబంధ సంస్థలను భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా చర్యలు తీసుకుంది. అంతేకాదు.. ఆ సంస్థ సంపాదించిన లాభం మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్స్‌ లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది సెబీ. దీనిపై జేన్‌ స్ట్రీట్ స్పందించింది. సెబీ బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందాయని.. తాము సంప్రదింపులు జరుపుతునట్లు వివరించింది.

Read Also:IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!

జేన్ స్ట్రీట్ సంస్థ 45 దేశాల్లో ట్రేడింగ్‌ నిర్వహిస్తూ ఉంటుంది. 3 వేల మందికి పైగా సిబ్బందితో గ్లోబల్ ట్రేడింగ్‌ చేస్తుంది. స్టాక్ మార్కెట్‌ లోని లొసుగులను గుర్తించి..అక్రమ పద్దతుల్లో ట్రేడింగ్‌ చేసింది. ట్రేడింగ్ పొజిషన్ల సూచీల దిశ, గమనాన్ని మార్చి వేల కోట్లు ఆర్జించినట్లు తేల్చింది సెబీ. ఇందుకోసం ఆ సంస్థ రెండు వ్యూహాలు పన్నినట్లు గుర్తించింది.

మార్నింగ్ పంప్, ఆఫ్టర్‌ నూన్ డంప్. అంటే.. ఉదయం ప్రముఖ సంస్థల స్టాక్స్, ఫ్యూచర్స్‌ను భారీగా కొనుగోలు చేస్తుంది. అదే రోజు ఉదయం బ్యాంక్‌ నిఫ్టీ సూచీని ఆప్షన్స్‌ మార్కెట్లో సెల్‌ చేస్తుంది. మధ్యాహ్నం బ్యాంక్‌ నిఫ్టీలోని కంపెనీల స్టాక్‌, ఫ్యూచర్స్‌ ను దూకుడుగా అమ్మేస్తుంది. క్యాష్‌ మార్కెట్లో ఆ కంపెనీల షేర్ల అమ్మకాలతో ఆప్షన్స్‌ లో బ్యాంక్‌ నిఫ్టీ షార్ట్‌ పొజిషన్ల విలువ భారీగా పెరుగుతుంది. తేలిగ్గా ఆ పొజిషన్ల నుంచి లాభాల్లో బయటకు వచ్చేస్తుంది.

Read Also:HUAWEI Watch Fit 4 Series: స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో హువాయి స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..!

ప్లాన్‌-2 లో ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజుల్లో మానిప్యులేషన్. ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల చివరి రోజున మార్కెట్ ముగిసే సమయంలో భారీ ట్రేడ్‌లు చేసి సూచీలను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. దీనివల్ల వారి ఆప్షన్స్ పొజిషన్స్ నుంచి భారీ లాభాలు పొందేవారు. అది ఎలా అంటే.. జేన్ స్ట్రీట్‌కు సంబంధించిన మరో నాలుగు సంస్థలు ఉన్నాయి. ఒక సంస్థ క్యాష్‌, ఫ్యూచర్‌ మార్కెట్లలో ఆర్డర్లు పెట్టడం, లావాదేవీలు చేయడం చేస్తుంటే.. అదే సమయంలో మరో సంస్థ ఆప్షన్స్‌ మార్కెట్లో దానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ఇక చివరి రెండు గంటల్లో నిఫ్టీ సూచీలో కీలకమైన షేర్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో నిఫ్టీ సూచీ ఆప్షన్స్‌లో లాంగ్‌ పొజిషన్‌ తీసుకొంటుంది. నిఫ్టీలోని షేర్ల విలువ పెరగడంతో.. సూచీ ఆప్షన్స్‌ భారీగా పెరిగి లాభాలు వస్తాయి. ఇలా చేసి జేన్‌ స్ట్రీట్‌ కేవలం 21 రోజుల్లోనే 4వేల 843 కోట్లు లాభం ఆర్జించినట్లు గుర్తించింది సెబీ.

Exit mobile version