Site icon NTV Telugu

Arunachal Pradesh: అరుణాచల్‌లో విరిగిన కొండచరియలు.. చైనాతో తెగిపోయిన సంబంధాలు

Arunachal Pradesh

Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని దిబాంగ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే జాతీయ రహదారి 33లో కొంత భాగం కొట్టుకుపోయింది. దిబాంగ్ వ్యాలీ చైనాకు ఆనుకుని ఉన్న ప్రాంతంగా ఉంది. హైవేలో కొంత భాగం తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక బృందం అక్కడ మరమ్మతులు చేస్తుంది.

Read Also: PAN Card : పాన్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. మే 31 వరకు ఈ పని చేయకుంటే చిక్కుల్లో పడతారు

కాగా, జాతీయ రహదారి మరమ్మతుల కోసం అవసరమైన అన్ని వస్తువులను పంపినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలతో సహా అన్ని వస్తువులు సంఘటన స్థలంలో సరఫరా చేయబడుతున్నాయి. వాస్తవానికి జిల్లా ప్రజలకు, సైన్యానికి ఈ రహదారి జీవనాడి లాంటిది.. ఈ హైవే కనెక్షన్‌ తెగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే, చైనా సరిహద్దుకు చేరుకోవడానికి సైన్యం కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంది. హైవే దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రదేశం గుండా ఎవరూ వెళ్లొద్దని సూచించింది. ఈ రహదారి మరమ్మతులకు కొన్ని రోజులు పడుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.

Exit mobile version