NTV Telugu Site icon

Tirumala: నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా కేటాయించామని ఆలయ కమిటి ప్రెసిడెంట్ ఇఓ శ్యామలరావు తెలిపారు.

Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి

సర్వదర్శనం భక్తులకు 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మూడు రోజుల పాటు 1,20,000 టోకెన్లు జారీ చేయబడతాయి. తిరుమలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసారు. ఇదిలా ఉండగా, జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత, జనవరి 10వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారి స్వర్ణ రథం ఉరేగింపును నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం 4:30 నుండి 5:30 గంటల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రయాగలో కుంభమేళా సందర్భంగా, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు శ్రీవారి నమూనా ఆలయం నిర్మించబడనుంది.

Also Read: Donald Trump On Tiktalk: టిక్‌టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?

తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రత్యేక దర్శనాలను 10వ తేది ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని వారిని, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని కియోస్కి విధానం ద్వారా విరాళాలు పెరుగుతున్నాయని, గత 15 రోజుల్లో 55 లక్షల రూపాయల విరాళాలు అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Show comments