Massive Fire Incident: హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టీఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశారు. అయితే, మంటలు పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించాయి. అవి పూర్తిగా దగ్ధమయ్యాయి.
Also Read: Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
ఒక్కసారిగా భారీ మంటలు రావడంతో పరిసర ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంతవరకు జరిగినది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికుల మధ్య జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేసింది.