Site icon NTV Telugu

Mumbai: ముంబై గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం

Mumbai Fire

Mumbai Fire

ముంబై మలాడ్ ఈస్ట్‌లోని వర్దమాన్ గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని పేర్కొన్నారు.

ముంబైలోని మలాడ్ ఈస్ట్ సెంట్రల్ ప్లాజా కాంప్లెక్స్‌లోని దఫ్తారీ రోడ్డు దగ్గర ఉన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవనంలోని ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ దగ్ధమైంది. ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఇంకా అధికారులు అంచనా వేయలేదు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా అంచనాలు వేస్తున్నారు.

 

Exit mobile version