Site icon NTV Telugu

Russia: రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్లో పేలుడు ప్రమాదం.. 27 మంది మృతి

Rusia

Rusia

రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మ‌రో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంత రాజధాని మఖచ్కల శివార్లలో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. రష్యా కాలమానం ప్రకారం.. రాత్రి 9:40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Soldier: జవాన్ కు ఘనంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు… వీడియో వైరల్

కార్ల సర్వీసింగ్ సెంట‌ర్‌లో మంటలు ప్రారంభమై సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించడంతో పేలుడు సంభవించిందని రష్యా ప్రభుత్వ అధికారులు. అయితే ఈ పేలుడు దాటికి 600 చదరపు మీటర్ల వ‌ర‌కూ మంటలు చెలరేగాయని నివేదికలు పేర్కొన్నాయి. గ్యాస్‌ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్‌ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 250 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ కొందరినీ చికిత్స కోసం మాస్కోకు విమానంలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా అధికారులు నేర విచారణ ప్రారంభించారు.

Exit mobile version