NTV Telugu Site icon

EarthQuake: పాక్ లో భూకంపం.. ఇళ్లనుంచి పరుగులు తీసిన జనం

Earthquake

Earthquake

EarthQuake: పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. భూమి కంపించిన వెంటనే ప్రజలు తమ నివాసాలు వదిలి భయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం గురించి సమాచారం లేదు. ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 1: 24 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఇస్లామాబాద్‌ కు పశ్చిమ దిశగా 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్లేట్ల కదలికల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్ లో సంభవించిన భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం అంచనా వేసింది. 10 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈ నెల 19వ తేదీన 5.6 తీవ్రతతో ఇస్లామాబాద్, ఖైబర్-పఖ్తుంఖ్వాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

Read Also: Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి

ఇస్లామాబాద్, పెషావర్‌, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక ఇతర నగరాల్లో ప్రకంపనలు సంభవించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ధాన్యాలను తీసుకెళ్లే లారీలు, భారీ ట్రక్కులను స్థానికులు దాడులు చేసే పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య భూకంపం వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటు చేసుకోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసినట్టయింది.