Raviteja : మాట ఇచ్చి నిలబెట్టుకున్న రవితేజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా నటిస్తూ హీరోగా మారారు.రవితేజ తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు .తన కెరీర్ ఓ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు .కెరీర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ తో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గట్టిగ నమ్ముతారు. అందుకే టాలెంట్ వున్న యంగ్ హీరోలను ప్రోత్సహిస్తుంటాడు. అదేవిధంగా నూతన దర్శకులకి అవకాశం ఇస్తూ వారి టాలెంట్ నిరూపించుకునేలా ప్రోత్సహిస్తుంటారు.ఇక రవితేజ ఒక్కసారి మాటిస్తే తప్పడని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు.
తాజాగా రవితేజ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బిగ్ బాస్ ద్వారా పేరు పొందిన అమర్‌దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కి హాజరైన రవితేజ అమర్ కి ఓ మాట ఇచ్చారు.నీకు రవితేజ సినిమాలో అవకాశం కావాలంటే హౌస్ నుంచి బయటికి వచ్చేయ్ అని నాగార్జున అనడంతో వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుని బయటకు వచ్చేసాడు. ఆ తరువాత సరదాగా చెప్పాము హౌస్ లోకి తిరిగి వెళ్ళు అని నాగార్జున తెలిపారు.తన కోసం ఇన్నిరోజులు కష్టపడి ఆడిన గేమ్ ను వదిలి వచ్చేయడంతో షాక్ అయిన రవితేజ నీకు నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా అవకాశం ఇస్తా అంటూ ఓ మాట ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం రవితేజ్ అమరదీప్ కు అవకాశం ఇచ్చారు.ఈరోజు షూటింగ్లో పాల్గొంటున్నట్టు అమరదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఎట్టకేలకు నా డ్రీం నెరవేరింది అంటూ రవితేజకు అమరదీప్ థాంక్స్ చెప్పాడు .
Also Read
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!