Site icon NTV Telugu

Mr.Idiot : హీరోగా రవితేజ వారసుడు..టీజర్ అదిరిపోయిందిగా..

Whatsapp Image 2024 05 10 At 11.57.49 Am

Whatsapp Image 2024 05 10 At 11.57.49 Am

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు.రవితేజ సినీ కెరీర్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.మాధవ్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో మిస్టర్. ఇడియట్ అనే చిత్రం తెరకెక్కుతుంది.అయితే రవితేజ కెరీర్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు మాధవ్ కూడా పెదనాన్న హిట్ సినిమా టైటిల్ తోనే టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “మిస్టర్. ఇడియట్ “మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాధవ్ యాక్టింగ్ చూస్తే రవితేజ ఐకానిక్ మూవీ ఇడియట్ గుర్తుకు వస్తుంది.రవితేజ వాకింగ్ స్టైల్ ను ఈ సినిమాలో మాధవ్ రీక్రియేట్ చేయడం హైలైట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు..మిస్టర్ ఇడియట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు .

Exit mobile version