NTV Telugu Site icon

Mass Jathara: ‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందోచ్..

Mass Jathara

Mass Jathara

Mass Jathara: వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తన ఎనర్జీని ప్రూవ్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ దూసుకెళ్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగెల్ సినిమాల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన రవితేజకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగానే భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు “మాస్ జాతర” అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. రవితేజ కెరీర్‌లో ఇది 75వ సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీతో పాటు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also: D 56: గొప్ప యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేసిన ధనుష్

ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా మరోమారు జోడి కట్టింది. ఇద్దరి ఎనర్జీ కలిసితే స్క్రీన్ మీద పండగే అంటున్నారు అభిమానులు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి ఆదరణ ఉంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘టూ మేరా లవర్’ ను ఏప్రిల్ 14 న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మాస్ బీట్, రవితేజ-శ్రీలీల ఎనర్జీ తో ఈ సాంగ్ సంగీత ప్రియులను ఊపేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు మాస్ ట్యూన్స్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, పోస్టర్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మాస్ మహారాజ రవితేజ నుంచి మళ్లీ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ “మాస్ జాతర” పండుగలా మారనుంది.