దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్‌డేట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో వస్తున్న నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ (Swift).. అడాస్ (ADAS) వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్స్ విత్ 6-ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది.
కొత్త డిజైన్:
స్విఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్త గ్రిల్‌తో పాటు, హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRL) ఉన్నాయి. సుజుకి లోగో ఇప్పుడు బానెట్ పైభాగంలో ఉంచారు. ఇరువైపులా కొత్తగా డిజైన్ చేయబడిన డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున పునఃరూపకల్పన చేయబడిన టెయిల్‌గేట్, దిగువన స్కిడ్ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్ ఉంది. అదనంగా.. స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, విలక్షణమైన C-ఆకారపు DRLలతో LED టైల్‌లైట్‌లను కలిగి ఉంటుంది.
AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..
ఫీచర్లు:
ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, మారుతి బ్రెజాల్లో మాదిరిగా బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీంతోపాటు ఆల్ న్యూ డాష్ బోర్డ్ లేఔట్ ఉంటుంది. 9.0-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తోపాటు న్యూ డాష్ బోర్డ్ లేఔట్, స్లీక్ ఏసీ వెంట్స్, బాటంలో హెచ్ వ్యాక్ కంట్రోల్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ చేశారు.
కొత్త స్విఫ్ట్ Z-సిరీస్ కారులో 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 82 బీహెచ్పీ, 108 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో CVT ట్రాన్స్‌మిషన్ ఉపయోగించారు. DC సింక్రోనస్ మోటార్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వెర్షన్ కూడా ఉంది. ఇది 3.1 బీహెచ్పీ, 60 Nm టార్క్‌ను జోడిస్తుంది. ఇంధన సామర్థ్యం పరంగా, ప్రామాణిక స్విఫ్ట్ మరియు మైల్డ్-హైబ్రిడ్ మోడల్‌లు WLTP సైకిల్‌లో వరుసగా 23.4 kmpl, 24.5 kmpl ప్రయాణించగలవు. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్‌కు హైబ్రిడ్ టెక్నాలజీ లభిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుత మోడల్ స్విఫ్ట్ ధర రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ఫీచర్లు, డిజైన్ తో వస్తున్న న్యూ స్విప్ట్ కారు ధర రూ.6.3 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుందని భావిస్తున్నారు.