NTV Telugu Site icon

Maruti Alto K10 Price: డౌన్‌పేమెంట్ కూడా లేకుండా.. కేవలం రూ. 7 వేలకే ఈ కారుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు!

Maruti Alto K10

Maruti Alto K10

Here is Maruti Alto K10 EMI Calculator Details: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి సుజుకి ఆల్టో’ కూడా ఒకటి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే ఇందుకు కారణం. మారుతి ఆల్టో కె10 ఏకంగా 35కిమీ వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారు నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఇది పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర 4 నుంచి 6 లక్షల మధ్య ఉంది. ఆల్టో కె10 బేస్ వేరియంట్‌పై 100 శాతం ఫైనాన్స్ చేస్తే.. దాదాపు రూ. 7000 ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

ఆల్టో కె10 కారులో BS-VI ఫేజ్ 2 కంప్లైంట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 67 PS శక్తిని ఉత్పత్తి మరియు 89 Nm టార్క్ ఇస్తుంది. అయితే సీఎన్‌జీలో పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్‌జీ ఇంజన్ 57PS మరియు 82.1Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంటుంది.

ఆల్టో కె10 కారు పెట్రోల్‌పై లీటరుకు 25 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీలో మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సీఎన్‌జీలో ఈ కారు కిలోకు 35 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. వార్షిక వ్యయం సుమారు 6-7 వేల రూపాయలు. అంటే నెలకు దాదాపుగా 500 రూపాయలు. అయితే ఇందులో స్పేర్ పార్ట్ ఖర్చు ఉండదు అని మీరు గమనించాలి. స్పేర్ పార్ట్, సర్వీస్ ఛార్జ్ ఖర్చు అందనంగా ఉంటుంది.

Also Read: Cheap Electric Scooter 2023: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 110కిమీ రేంజ్! ధర కూడా తక్కువే

ఆల్టో కె10 బేస్ మోడల్ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 4.41 లక్షలుగా ఉంటుంది. మీరు ఆన్-రోడ్ ధర (పూర్తి కాస్ట్ లోన్)పై 7 సంవత్సరాల పాటు 9 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే.. అప్పుడు ఈఎంఐ దాదాపు రూ. 7,108 అవుతుంది. అంటే డౌన్‌పేమెంట్ కూడా లేకుండా.. కేవలం రూ. 7 వేలకే ఈ కారుని మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వడ్డీ రేటు, డౌన్‌పేమెంట్ ఆధారంగా ఈఎంఐ మారుతుందనే విషయం తెలిసిందే.