Maruti Alto K10 Price: డౌన్‌పేమెంట్ కూడా లేకుండా.. కేవలం రూ. 7 వేలకే ఈ కారుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here is Maruti Alto K10 EMI Calculator Details: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి సుజుకి ఆల్టో’ కూడా ఒకటి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే ఇందుకు కారణం. మారుతి ఆల్టో కె10 ఏకంగా 35కిమీ వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారు నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఇది పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 4 నుంచి 6 లక్షల మధ్య ఉంది. ఆల్టో కె10 బేస్ వేరియంట్‌పై 100 శాతం ఫైనాన్స్ చేస్తే.. దాదాపు రూ. 7000 ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
ఆల్టో కె10 కారులో BS-VI ఫేజ్ 2 కంప్లైంట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 67 PS శక్తిని ఉత్పత్తి మరియు 89 Nm టార్క్ ఇస్తుంది. అయితే సీఎన్‌జీలో పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్‌జీ ఇంజన్ 57PS మరియు 82.1Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంటుంది.
Also Read
ఆల్టో కె10 కారు పెట్రోల్‌పై లీటరుకు 25 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీలో మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సీఎన్‌జీలో ఈ కారు కిలోకు 35 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. వార్షిక వ్యయం సుమారు 6-7 వేల రూపాయలు. అంటే నెలకు దాదాపుగా 500 రూపాయలు. అయితే ఇందులో స్పేర్ పార్ట్ ఖర్చు ఉండదు అని మీరు గమనించాలి. స్పేర్ పార్ట్, సర్వీస్ ఛార్జ్ ఖర్చు అందనంగా ఉంటుంది.
ఆల్టో కె10 బేస్ మోడల్ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 4.41 లక్షలుగా ఉంటుంది. మీరు ఆన్-రోడ్ ధర (పూర్తి కాస్ట్ లోన్)పై 7 సంవత్సరాల పాటు 9 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే.. అప్పుడు ఈఎంఐ దాదాపు రూ. 7,108 అవుతుంది. అంటే డౌన్‌పేమెంట్ కూడా లేకుండా.. కేవలం రూ. 7 వేలకే ఈ కారుని మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వడ్డీ రేటు, డౌన్‌పేమెంట్ ఆధారంగా ఈఎంఐ మారుతుందనే విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!