పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఆదిపురుష్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై నే ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటికే సలార్ నుంచి విడుదలయిన గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో సలార్ సినిమా భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో కూడా ఓ సినిమాను చేస్తున్నాడు.. మారుతి చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.మొదటి సారి దర్శకుడు మారుతీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అయితే మారుతి ఈ సినిమాను ఎలా తెరాకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈక్రమం లో ఈమూవీకి సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మరో హీరో కోసం ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర ఉందని సమాచారం.. ఈ సినిమా లో ప్రభాస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసే ఒక ఇంటరెస్టింగ్ పాత్ర ఉంటుందట.ఈ పాత్రలో ఓ యంగ్ హీరోని తీసుకోవాలి అని దర్శకుడు మారుతీ భావిస్తున్నట్లు సమాచారం.. .అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కుతున్న కారణంగా.. బాలీవుడ్ నుంచి ఓ యంగ్ హీరోని తీసుకోవాలని మారుతి ఆలోచిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ యంగ్ హీరో పాత్ర కాస్త కామెడీగా ఉంటుందని సమాచారం. దీనితో ఈ పాత్ర కోసం జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు… మరి ఈ పాత్ర కోసం మారుతీ ఏ హీరోను సెలక్ట్ చేస్తాడో చూడాలి.