విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల గ్రేహౌండ్స్ పోలీసులకు నగరశివారులో భూమిని కేటాయించారు.. బాధితులు ఆ స్థలంలో నిర్మాణాలు చేస్తుండగా అటవీశాఖ అధికారులు వారిపై దాడులు చేసి వారిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.. 2008 జూన్ లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో నక్సలైట్ల మెరుపు దాడిలో మరణించిన గ్రేహౌండ్ 33 పోలీసుల కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కుత్బుల్లాపూర్ గాజులరామారం సర్వే నెంబరు 16 లో 3.10 ఎకరాల భూమిని కేటాయించారు.. 2014 సెప్టెంబరు 30 న అప్పటి ఎపి, తెలంగాణ డీజీపీలు జె.వి. రాముడు, అనురాగం శర్మ లు భూమి పూజ చేసారు. ఈ స్థలం అటవీ శాఖ, ప్రయివేట్ సర్వే నెంబర్లు ప్రక్క ప్రక్కనే ఉండడంతో హద్దులు చేయకుండా వదిలేసారు..తెలంగాణా ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని ప్రతిపాదించారు.. కాని ఆదర్శంగా అడుగులు పడలేదు.
Also Read : Meenakshi Chaudhary: హిట్ 2 భామ క్లివేజ్ షో తో హీటెక్కిస్తోందే
దీంతో బాధితులు అసోషియేషన్ ఏర్పాటు చేసుకొని ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఈ భూమి తమ పరిధిలోకి వస్తుందని నిర్మాణాలను పడగొట్టి వారిపై దాడి చేసి జీపులో తీసుకెళ్లారని బాధితులు వాపోతున్నారు.. మాకు పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేసిన స్థలం మాదంటూ, అటవీశాఖ అధికారులు ఇలా ప్రవర్తించడం అమానుషం అంటూ, తమకు న్యాయం చేయాలని తెలంగాణా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కేటాయించిన స్థలంలో ధర్నా చేస్తున్న బాధితులు.. తమ పిల్లలను పోగొట్టుకొన్న తమకు ఆసరాగా ప్రభుత్వం కేటాయించిన తమ స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
