హైదరాబాద్; సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షతను విడనాడాలని నవ సర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మార్టిన్ మక్వాన్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి కృష్ణ అధ్యక్షతన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళిత బహుజన ఫ్రెండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అంటరానితనం, అత్యాచారాల నిర్మూలన ఎండమావేనా అనే అంశంపై నిర్వహించిన సమైక్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్ పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు… భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న దళితులపై అత్యాచారాలు, అంటరానితనం ఇంకా 54 శాతం సమాజం లో ఉంది అని అన్నారు. దానిని పారదోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.దళితులకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించేందుకు ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చిన్న బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
