Martin Luther King : సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..మార్టిన్ లూథర్ కింగ్. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాను తమిళం లో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించాడు..మండేలా తెలుగు రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. ఇక దర్శకురాలిగా ఆమె కు ఇదే తొలి సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ను అప్‌డేట్ ఇచ్చారు.మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ‘కింగ్ కింగ్’ అనే పాటను మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక ప్రస్తుత రాజకీయాల కు సంబంధించిన కథాంశం తో రానున్న ఈ సినిమా లో తమిళంలో యోగిబాబు పోషించిన పాత్రను తెలుగులో సంపూర్ణేష్ బాబు చేస్తున్నాడు. నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ మరియు గోపరాజు రమణ తదితరులు ఈ సినిమా లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా ను వైనాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తుండగా.. కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించే బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ఈ కామెడీ తో పాటు మంచి సందేశాత్మక కథాంశం తో రాబోతున్నాడు.. దీనితో సంపూర్ణేష్ బాబు ఈ సారి ప్రేక్షకులను ఎలాగైనా మెప్పించాలని చూస్తున్నాడు.
Also Read
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!