NTV Telugu Site icon

Married Woman : పెళ్లయిన నెలకే కొత్త పెళ్లి కూతురు జంప్.. కాకపోతే అబ్బాయితో కాదు

Married Girl

Married Girl

Married Woman: ప్రేమ, ఎప్పుడు ఎవరిపై ఏర్పడుతుందో చెప్పలేము. అంతే కాకుండా లింగభేదంతో కూడా పనిలేదనే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. పెళ్లైన నెల రోజుల తర్వాత భర్తను వదిలేసి.. తన స్నేహితురాలితో వెళ్లిపోయింది ఓ యువతి. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు యువతుల మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమలో ఏర్పడిన బంధం శారీరక సంబంధానికి దారితీసింది. ఆపై ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. వీళ్ల సంగతి తెలుసుకున్న ఓ అమ్మాయి తల్లిదండ్రులు హడావుడిగా సంబంధం కుదర్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఎలాగైనా జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులకే పెళ్లయిన యువతి ఆమె భర్తకు షాకిస్తూ తన ప్రియురాలితో కలిసి జంప్ అయింది.

Read Also: Heart Attack: ఫ్రెండ్స్‌తో థియేటర్‌ కి వెళ్లాడు.. సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలీపూర్‌ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి.. కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత అది మరింత గాఢంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తెకు అప్పటికప్పుడు సంబంధం కుదిర్చి వివాహం జరిపించారు.

Read Also: Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష

అక్కడితో సమస్య కొలిక్కి వస్తుందని భావించారు. అయితే, వారి ఆశలు ఫలించలేదు. పెళ్లయిన నెల తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లి ప్రేయసి వద్దకు చేరుకుంది.ఇద్దరూ కలిసి మాల్దాలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తాము మేజర్లమని, తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని, లేదంటే కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

Show comments