NTV Telugu Site icon

Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!

Marriage

Marriage

Marriage: ఇటీవల కాలంలో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికే మొగ్గుచూపుతున్నారు. అలాగే 30 నుంచి 40 ఏళ్లు దాటిన వారు కూడా పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే పెళ్లిచేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. పెళ్లితో చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని తెలుస్తోంది. అలాగే పెళ్లి చేసుకుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా దరి చేరవని తెలుస్తోంది. ఒంటరిగా జీవించే వారితో పోలిస్తే పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే చక్కని జీవితం జీవించడానికి పెళ్లి ఒక మంచి మార్గం అని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న వారిలో అధిక రక్తపోటు డయాబెటిస్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఎలాంటి మానసిక ఒత్తిళ్లనైనా ఒక మంచి జీవిత భాగస్వామి ఉన్నవారు తేలికగా ఎదురుకోగలుగుతారని లేకపోతే ఒంటరితనంతో బాధపడే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది..

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వివాహితులు తొందరగా కోలుకుంటున్నట్లు అధ్యయనాల్లో తెలిసింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో కూడా వివాహితులు 16 శాతం ఎక్కువగా జీవిస్తున్నారని.. అలాగే మనిషి ఆనందంగా ఉండడానికి వివాహం బంధం అవసరమని తెలుస్తోంది. అలాగే సామాజిక పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మనుషులు, కుటుంబం అన్ని కూడా మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. వివాహం అనేది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుందని.. వివాహితులు చాలా వరకు రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం నుంచి దూరంగా ఉన్నారని అధ్యయనంలో తేలింది.

Mohan Lal : రోడ్డుపై కాగితాలు ఏరుతున్న సూపర్ స్టార్ మోహన్ లాల్

పెళ్లి చేసుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. వివాహితులు వెళ్లి కానీ వారి కంటే రెండేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. వివాహితులు పెళ్లి అయిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వల్లే ఈ దీర్ఘాయువుకు కారణమని తేలింది. పెళ్లయిన వారు బాగా తింటారని, అతిగా ధూమపానం, మద్యపానం చేసే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఈ ఆరోగ్యకరమైన ప్రవర్తనలన్నీ వివాహితులు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారో వివరించడంలో సహాయపడతాయి. అయినప్పటికీ, అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకున్న స్త్రీల కంటే పురుషులే ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో తెలిసింది. మహిళలు వారి భర్తలను ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించి వారికి ప్రయోజనం చేకూర్చడంలో ముందుంటారు. అంతే కాకుండా పెళ్లి అనంతరం తమ భాగస్వాములు ఆరోగ్య ప్రవర్తనలను మార్చుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో వ్యవహరిస్తారు. వ్యాయామం వంటివి చేయాలని పదే పదే ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల భార్యాభర్తల ఆరోగ్యం బాగుంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది.