Site icon NTV Telugu

Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..

Marrige

Marrige

తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఓ వధువు తాను తాళి కట్టించుకోవడానికి ముందు కాబోయే భర్త చదువుకోలేదని తెలిసింది. అయితే అతడు రెండో ఎక్కం కూడా చెప్పలేకపోయాడు. ఇక అంతే ఆ పెళ్లిని పెళ్లికూతురు ధైర్యంగా క్యాన్సిల్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మెహబూబా జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మాల్సా పెళ్లికి ముందు నిమిషంలోనే తన కాబోయే భర్త బండారం తెలుసుకోవడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. పెళ్లి మాటలు జరిగిన సమయంలో వరుడు బాగా చదువుకున్నాడని వారి కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పారు. కాకపోతే వధువు చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అబ్బాయి చదువుకున్నాడని అబద్ధం చెప్పడంతో సదరు పెళ్లి కూతురు పెళ్లికి ఒప్పుకొని పెళ్లి పీటల దాకా చేరుకుంది.

Also Read: Malla Reddy: రాజేందర్ అన్న నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇకపోతే చివరి నిమిషంలో అసలు విషయం కనిపెట్టి పెళ్లి మండపంపై ని వధువు వరుడికి టెస్ట్ పెట్టడంతో అతని బాగోతం బయటపడింది. ఈ సందర్భంగా వధువు వరుడుని రెండవ ఎక్కం చెప్పమంటే నీళ్లు నమిలాడు. ఈ దెబ్బతో వరుడు ఏమి చదవలేదన్న విషయం పెళ్లి కూతురికి ఇట్లే తెలిసిపోయింది. ఈ దెబ్బతో పెళ్లి పీటల నుంచి వధువు లేచి వెళ్ళిపోయింది. పూల దండలు మార్చుకున్న సమయంలో వధువు మాల్సాతో వరుడు మాటలు కలిపగ.. పంతులుగారు మంత్రాలు చదువుతుంటే ఈ మంత్రాలు, లెక్కలు అసలు నాకు రావంటూ మాట జారాడు. ఆ దెబ్బతో పెళ్లి కూతురికి అనుమానం వచ్చింది. ఇకంతే అతడి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ మొత్తం మారిపోయాయి.

Exit mobile version