కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతేకాకుండా అమిత్ షాతో అనంతరం కాంగ్రెస్ పార్టీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వీడుతున్నట్లు శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ లో లేదన్న శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని శశిధర్ రెడ్డి అన్నారు. అయితే.. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Gautam Adani New Plans: విదేశాల్లో కొత్త బిజినెస్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ..
అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. మర్రి శశిధర్ రెడ్డిని టీపీసీసీ బహిష్కరించింది. కాంగ్రెస్‌కు కాన్సర్ సోకిందన్న మర్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంది. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలువడంతో పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించిన మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక చర్యలతో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది.
