NTV Telugu Site icon

Big Shock to Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ.. పార్టీ మారనున్న సీనియర్ నేత?

Marri

Marri

Big Shock to Congress: కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నేతలు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీకి కోలుకోలేని విధంగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్నగాక మొన్న రాజ్ గోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే వరుసలో ఇప్పుడు మరో సీనియర్ నేత పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతలు బహిరంగంగానే టీపీసీసీ రేవంత్‌ రెడ్డిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం సాయంత్రం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన వెంట బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారనున్నట్లు సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు.

Read Also: Anjali jhansi web series : వెబ్ షోస్ లో అంజలి యాక్షన్ డ్రామా ‘ఝాన్సీ’ కి సెకండ్ ప్లేస్

బీజేపీ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కింద ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను చేర్చుకుంటూ రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాపులర్ నేతలపై గురి పెట్టింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ సాయంత్రం ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని చెపుతున్నారు. రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్ కారణమని, కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా ఆయన పనులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రేవంత్ కు ఏజెంట్ లా పని చేస్తున్నారంటూ విమర్శించారు.

Read Also: Talasani Srinivas: మంత్రి సోదరులను విచారిస్తున్న ఈడీ అధికారులు

ఈ క్రమంలోనే మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలో నిజం లేదన్నారు. తాను ఢిల్లీ వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా రాజకీయాలనుంచి రిటైర్ ఇప్పట్లో కానని కొనసాగనున్నట్లు ప్రకటించారు. తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో తనతో డీకే అరుణ ఉన్నారన్న వార్తపై క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు మరెందరో ఇతర పార్టీల నాయకులు సైతం ఉన్నారన్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు ఏ పార్టీలో ఎంతకాలం పనిచేస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

Show comments