తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. తెలంగాణ నకిలీ ఓటర్లు ఉన్నారంటూ బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి సీఈవోను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. 8 అంశాలతో సీఈఓని కలిశామన్నారు. లక్ష 65 వేల డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు అని సీఈఓ కి తెలిపామని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. ఫైనల్ రూల్ ముందే గుర్తించాల్సి ఉండే.. కానీ గుర్తించలేదని ఆయన అన్నారు.
Also Read : Gopichand 32 : సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న శ్రీను వైట్ల…
అంతేకాకుండా.. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ను వీడటంపై మర్రి శశిధర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ లో దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అగ్ర నాయకులను కలిసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారని, కాంగ్రెస్ లో గెలిచిన వారు ఆ పార్టీలోనే ఉంటారని గ్యారంటీ ఎవరు ఇస్తారన్నారు మర్రి శశిధర్ రెడ్డి.
Also Read : KCR: ‘కేసీఆర్’గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?
