Anna Rambabu: ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ జనరంజక పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం కొనకనమిట్ల మండలంలోని వింజవర్తిపాడు, దేవిరెడ్డిపల్లి, తూర్పుపల్లె, నాగంపల్లి, నాగంపల్లి ఎస్సీ మాదిగ పాలెం, ఎస్సీ మాల పాలెం, గాజులపల్లి, గాజులపల్లి ఎస్సీ మాదిగపాలెం, ఎస్సీ మాలపాలెం, చినమనగుండం, చినమనగుండం ఎస్సీకాలనీ, బ్రాహ్మణపల్లి, గొట్లగట్టు, నాయుడుపేట, నాయుడుపేట ఎస్సీకాలనీ, వెలుగొండరాయునిపల్లె, బుడంకాయలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం లో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరిందని వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్త పై ఓటు వేసి గెలిపించాలన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలందరికి ఆమోదయోగ్యమైనదన్నారు. జగన్ మాటిచ్చాడంటే ఎన్ని ఇబ్బందులెదురైనా ఆ మాటను నెరవేర్చగలిగే సమర్థత కలిగిన నాయకుడన్నారు. గడిచిన ఐదేళ్లలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసారన్నారు. కరోనా వంటి కష్ట కాలంలో కూడా ప్రజలందరికి అండగా ఉండి సంక్షేమ పథకాలు అందించాడని తెలిపారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం సీఎం జగన్ నిజాయతీకి అద్దం పట్టిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట అమలు చేయలేని వాగ్దానాలతో అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు. జగనన్న ఆవిష్కరించిన ఎన్నికల మేనిఫెస్టో – 2024ను ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్క వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులు ప్రజలకు వివరించాలన్నారు. కావున మే నెల 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలంకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.