ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని… మీ ఓటుతో ఆదరించాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. శుక్రవారం నాడు తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం, సీతా నాగులవరం, తుమ్మల చెరువు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు.
Read Also: Actor Kidnap: మిస్సింగ్ కాదు కిడ్నాప్.. సీసీటీవీ ఫుటేజీతో పోలీసులు ట్విస్ట్!
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. పేదల ఇంటి ముంగిటకు ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు, రైతులకు గ్రామాల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగనన్న ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మహిళల ఖాతాల్లోనే జమ చేసి వారిని గౌరవిస్తున్నట్లు తెలిపారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వమే మళ్లీ రావాలంటే ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.