KP Nagarjuna Reddy: జగనన్న సురక్ష తో.. జనం సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషం గా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మందులు కూడా ఉచితంగా ఇస్తారని తెలిపారు.. గురువారం మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి, కోల భీమునిపాడు, కె.కొత్తపల్లి గ్రామలలో ఎంపీడీవో చందన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్‌ఱెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడని ప్రశంసలు కురిపించారు. ఇక, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండా వెంకటేశ్వర రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం సిబ్బంది, వైద్యాధికారులు రోహిత్ నాయక్, హరీష్ రావు, డేవిడ్, ప్రసన్న రాణి సహా సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: Viral Video: బతకడం అంత ఈజీ కాదు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది
ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న సురక్ష పథకంలో భారీగా పాల్గొన్నారు ప్రజలు.. ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యారు.. పొదిలి నాలుగోవ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు.. జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వైద్యశాఖ సిబ్బంది.. ఈ జగనన్న సురక్ష పథకం ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని తెలిపారు నాగార్జునరెడ్డి .. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం జగనన్న సురక్ష పథకాన్ని తీసుకొచ్చిన విషయం విదతమే.. ఈ శిబిరాల్లో ఒకే దగ్గర వైద్యం, టెస్ట్‌లు, మందులు కూడా పంపిణీ చేస్తోంది సర్కార్.