Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015లో ప్రారంభమైన అతని పదకొండేళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ నేటితో ముగిసింది. ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న మార్క్ వుడ్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లు అనే మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రయాణంలో అతను రెండు ప్రపంచకప్‌లను ఒక వన్డే , ఒక టీ20 గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు.
2015లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. తన కెరీర్లో మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి 119 వికెట్లు పడగొట్టగా, 70 వన్డేల్లో 80 వికెట్లు, 38 టీ20 మ్యాచ్‌లలో 54 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆరవ బౌలర్‌గా ఆయన నిలిచారు.
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ ప్రధాన పాత్ర పోషించారు. స్వదేశంలో జరిగిన ఆ టోర్నమెంట్లో ఆయన 18 వికెట్లు తీసి సత్తా చాటారు. గంటకు 95 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఆయన విసిరిన బంతులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ పట్టుదలగా బౌలింగ్ చేశారు. ఆ మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో బౌండరీల లెక్కింపు ఆధారంగా ఇంగ్లండ్ మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
ఆ తర్వాత 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారు. ఆ టోర్నమెంట్లో కేవలం 4 మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశారు. అలాగే నాలుగు యాషెస్ సిరీస్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2015 యాషెస్ సిరీస్‌లో ట్రెండ్ బ్రిడ్జ్ టెస్టులో ఆయన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ విజయంలోనూ, సిరీస్ కైవసం చేసుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 2023 యాషెస్ సిరీస్‌లో హెడింగ్లే వేదికగా ఆస్ట్రేలియాపై ఆయన చెలరేగి ఆడిన తీరు ఇంగ్లండ్‌కు పునరాగమనం చేయడానికి మార్గం సుగమం చేసింది.
తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాట్లాడుతూ… గడిచిన ఏడాది కాలం నా శరీరంపై పడిన భారాన్ని చూస్తే ఈ నిర్ణయం ఆశ్చర్యకరమైనది కాదని, కాంట్రాక్ట్ ముగిసే సమయానికి ఇదే సరైన సమయమని భావించానని తెలిపారు. ప్రతిసారీ గాయాల నుంచి కోలుకుని తిరిగి రావడానికి ప్రయత్నించానని, కానీ ఈసారి తన శరీరం సహకరించలేదని చెప్పారు. ఇంగ్లండ్ దేశం తరఫున ఆడటం తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవమని, ఇది తన కల అని పేర్కొన్నారు.
మార్క్ వుడ్ కెరీర్‌ను కొనియాడుతూ ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ.. పెద్ద మ్యాచులలో జట్టు విజయం కోసం ఎంతో ప్రభావం చూపిన ఆటగాడని, యాషెస్ విజయాలు, ప్రపంచకప్‌లు, ప్రేక్షకులను అలరించిన అతని బౌలింగ్ శైలిని చాలా తక్కువ మంది మాత్రమే సాధించగలరని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!