NTV Telugu Site icon

Prashant Kishore: ‘‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’’.. బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలనం..

Pk

Pk

Prashant Kishore: బీహార్ రాజకీయ పరిణామాల గురించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్య లు చేశారు. బీజేపీ-జేడీయూ కూటమి ఎక్కువ రోజులు ఉండదని ఆయన అన్నారు. నితీష్ కుమార్, బీజేపీతో కలిసిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. 2025 బీహార్ ఎన్నికల వరకు ఈ కూటమి నిలువదని అన్నారు. ఒక ఏడాది పాటే ఈ కూటమి అధికారంలో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఉంది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండదు, ఈ విషయాన్ని నేను లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వా ఆరు నెలల్లోనే మార్పు జరుగుతుందని చెప్పారు.

Read Also: Vicky Jain: భార్య ఇంట్లో లేని సమయంలో హీరో రాసలీలలు.. ముగ్గురు అమ్మాయిలతో..

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో సీఎంగా అధికారం చేపట్టనున్నారు. 2019 ఎన్నికల ముందు ఇలాగే ఆర్జేడీ పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసారు. ప్రస్తుతం 2024 ఎన్నికల ముందు కూడా ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించారు.