NTV Telugu Site icon

Marghani Bharath : ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించాం

Margani Bharath

Margani Bharath

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఇవాళ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. సీఎం జగన్ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని 300 కోట్లు విడుదల చేశారన్నారు మార్గాని భరత్. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల పంపిణీ ఎప్పుడో పూర్తయ్యేదని, ఇలాగే ఇళ్ల పట్టాల అందుకున్న గీతాంజలిని టిడిపి సోషల్ మీడియా హింసించి బలితీసుకుందని ఆయన విమర్శించారు. పట్టాల పంపిణీలో ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌ పర్సన్ షర్మిల రెడ్డి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పొలిటికల్ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబే ఇండిపెండెంట్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ పరిణామాలను జనసేన నేతలు లోతుగా పరిశీలించుకోవాలని సూచించారు.

Ramadan Iftar Feast: నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్

పేదల సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది..ఎంపీగా విజయం సాధించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని పొందలేదని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. సొంతింటి కల పేదలదైతే, వారికి పట్టాలివ్వాలన్నది నా కల అన్నారు. ఎన్నికలకు ముందే ఇళ్ళ పట్టాలిస్తానని లబ్ధిదారులకు చెబుతూ వచ్చానని, ఇవ్వగలనా లేదా అనే ఆందోళన నాలుగు రోజులుగా నన్ను వెంటాడిందన్నారు. తాడేపల్లి సీఎంఓలో కూర్చుని సాధించే వరకూ కదల్లేదని, నిద్రాహారాలు మాని ప్రయత్నించి..జగనన్న దయతో పేదలకు ఇళ్ళ స్థలాలు సాధించగలిగానని చెప్పారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా అడుగడుగునా కుట్రలు పన్నుతూనే ఉన్నారని, లేనిపోని బురద జల్లుతూనే ఉన్నారన్నారు. ఎవరెన్ని రకాల విమర్శలు, ఆరోపణలు చేసినా..నేను ప్రజలనే నమ్ముకున్నానని, వారి ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం ఉంటే చాలన్నారు. లబ్ధిదారులు అందరి తరపునా సీఎం జగనన్నకు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఎంత రాత్రి అయినా లబ్ధిదారులంతా ఇళ్ళ స్థలాలు తీసుకుని ఆనందంగా ఇళ్ళకు వెళ్ళమని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఇళ్ళ స్థలాలు సాధించి తాడేపల్లి నుండి రాజమండ్రి వచ్చిన ఎంపీ భరత్ కు నగరంలోని కోటిపల్లి బస్టాండు వద్ద నగర ప్రజలు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా, పూలవర్షంతో ఎంపీకి అఖండ స్వాగతం పలికారు. అక్కడ నుండి ఊరేగింపుగా సుబ్రహ్మణ్యం మైదానానికి ఊరేగింపుగా తరలివచ్చారు.