NTV Telugu Site icon

Margani Bharat: జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అక్రమం

Margani Barath

Margani Barath

Margani Bharat: జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అక్రమమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. పుష్ప-2 విడుదల సందర్భంగా ఆకస్మికంగా తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. సినిమా విడుదల రోజున హీరోలు థియేటర్లకు వెళ్ళటం ఎప్పటి నుంచో జరుగుతున్నదేనన్నారు. అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట ఘటనకు కారణం కాదన్నారు. అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ మా పార్టీ కాకపోయినా ఒక వ్యక్తిగా ఆయనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సీఎం చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.

Read Also: Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట అల్లు అర్జున్‌?

రాజకీయ నాయకుల సభల్లోనూ తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గత పుష్కరాల సమయంలో చంద్రబాబు రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో స్నానం చేసి వస్తుండగా 29 మంది మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబుపై కూడా కేసులు కట్టవలసి ఉండేదని మార్గాని భరత్ అన్నారు.