March 1 New Rules : నేటి నుంచి అమలుకానున్న కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పు ఉంటుంది. రేపు కూడా వాటి ధరల్లో మార్పు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఎల్పిజి సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరి చూపు ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలపైనే ఉంది. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ అంటే 14.2 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1053గా ఉంది.. అంటే స్వల్పంగా ధరలు పెరిగాయి..
Also Read
- Jobs: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ఫాస్టాగ్ ద్వారా టోల్ ట్యాక్స్ చెల్లిస్తే, ఈరోజే మీకు చివరి అవకాశం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ KYCని తప్పనిసరి చేసింది. దీని అప్డేట్స్ నిన్నటితో ముగిసింది.. ఈరోజు నుంచి ట్యాక్స్ కూడా కట్ అవుతుందని చెబుతున్నారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం కు సంబందించిన కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురాబోతుంది.. మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ పొడిగించింది…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది.. కొత్త రూల్స్ ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తాయి..
మార్చి 1 నుంచి వస్తు సేవల పన్ను GSTకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఈ – ఇన్ వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వారు కచ్చితంగా ఇ – వే బిల్లులు ఇవ్వాలి..
తాజావార్తలు
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Jobs: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్‌లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!