NTV Telugu Site icon

Amaran Special Show: ముఖ్యమంత్రి కోసం ‘అమరన్’ స్పెషల్ షో

Maran

Maran

Amaran Special Show: శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్మెంట్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈరోజు (అక్టోబర్ 31) విడుదలైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కె.ఎం. స్టాలిన్ కోసం.

Read Also: MS Dhoni: 19 ఏళ్ల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. ఒకే ఒక్కడు ఎంఎస్ ధోనీ!

కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కేరళకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ ఆర్మీ అనుమతితో జమ్మూ కాశ్మీర్‌లోని రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇప్పటికే సినిమా చూసిన ఆర్మీ అధికారులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ల కోసం మూవీ యూనిట్ స్పెషల్ షో ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన శివ‌కార్తీకియ‌న్ మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసిన ముఖ్యమంత్రి మమ్మల్ని మెచ్చుకున్నారు. మేజర్ ముకుంద్ జీవితం తెరపై బాగా తీసారని ఆయన అన్నట్లు తెలిపారు. ఆయన మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయని శివ కార్తియన్ అన్నారు. సీఎం స్టాలిన్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్రబృందాన్ని ప్రశంసించారు. మరోవైపు, ముఖ్యంగా సాయి పల్లవి పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇక సినిమా విడుదలైన ప్రతిచోటా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Show comments