Site icon NTV Telugu

Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మహిళా సర్పంచ్ భర్త దారుణ హత్య

Maoists

Maoists

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా రేవాలిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మహిళా సర్పంచ్‌ భర్తను మావోయిస్టులు. హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కౌకొండ బ్లాక్ పరిధిలోని రేవాలి పంచాయతీకి చెందిన మహిళా సర్పంచ్ భర్తను పదునైన ఆయుధాలతో హతమార్చినట్లు సమాచారం. ఈ హత్యలో మావోల పాత్రపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొంటున్నారు. నిన్న సాయంత్రం మావోయిస్టులు అతన్ని అపహరించారు. రేవాలి పటేల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

Brutally Thrashing : గదిలో విద్యార్థిని బంధించి క్రూరంగా దాడి.. నలుగురు విద్యార్థులు అరెస్ట్‌..

సమాచారం ప్రకారం.. అరన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలంగర్ ఏరియా కమిటీకి చెందిన ఐదారుగురు సాయుధ నక్సల్స్‌ శుక్రవారం అర్ధరాత్రి రేవాలి గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్‌ భర్త భీముడిని ఇంట్లో నుంచి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. మరుసటి రోజు గ్రామంలో భీముడి మృతదేహం కనిపించగా.. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన దంతెవాడ ఎస్పీ సిద్ధార్థ్‌ తివారీ.. విచారణ చేపట్టామని పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? మరెవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టామన్నారు.

Exit mobile version