Site icon NTV Telugu

Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపు.. మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ..

Maoist Party

Maoist Party

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆపరేషన్‌ కగార్‌‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకుంది. మావోయిస్టు కీలక నేతలను భద్రతా దళాలు మట్టబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఓ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాసుకొచ్చారు.. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖ విడుదల చేశారు.

READ MORE: Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్‌కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..

ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. జవాన్లూ వీరమరణం పొందుతున్నారు.

READ MORE: Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్‌కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..

కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు మే 21న మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు.

Exit mobile version